![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -359 లో....ఇందిరాదేవి ప్లాన్ ప్రకారం కావ్య విడాకుల పత్రాలపై సంతకం చేసి రాజ్ కి ఇస్తుంది. మీరు నన్ను వదిలేయాలని అనుకుంటున్నారు అందుకే విడాకులు ఇస్తానని అన్నారు. అందుకే వీటిపై సంతకం చెయ్యండి అని రాజ్ కి కావ్య ఇస్తుంది. ఇంత దూరం వచ్చాక.. ఇక అందరి చెప్పాలి. మీరు చెప్తారా.. నన్ను చెప్పమంటారా.. మా పుట్టింటి వాళ్లకు చెప్పడం నా బాధ్యత అని కావ్య అంటుంది. రాజ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోతాడు.
ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటే ఇందిరాదేవి కావ్య దగ్గరికి వెళ్లి ఇచ్చావా అని అడుగుతుంది. అది చూసి రుద్రాణి ఏం సీక్రెట్ మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. నీకు అన్ని కావాలి ముందు తిను అంటూ ఇందిరాదేవి కసురుతుంది. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. అపర్ణ టిఫిన్ చేసి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత రాజ్ ఈ రోజు వింతగా ప్రవర్తిస్తున్నాడు వానికి ఇడ్లీ ఇష్టం లేకున్నా సైలెంట్ గా తింటున్నాడని రుద్రాణి అంటుంది. అయ్యో నేను మర్చిపోయి పెట్టానని కావ్య అంటుంది. నా బ్రేక్ ఫాస్ట్ అయిపోయింది అంటూ రాజ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజ్ కి విడాకుల పత్రాలు ఇచ్చానని ఇందిరాదేవికి చెప్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి శ్వేత వచ్చి డివోర్స్ పేపర్స్ చూస్తుంది. ఇక రాజ్ కి అర్థం అయ్యేలా కావ్యని వదులుకోకు అని రాజ్ కి చెప్తుంది.
ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి అనామిక వచ్చి.. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నా హస్బెండ్ మా కంపెనీలు మొత్తం చూసుకుంటాడని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ముందు ఎవరైనా నిజం చెప్తారేమోనని టెన్షన్ గా ఉందని అనామిక అంటుంది. నేను చూసుకుంటాను.. నువ్వు టెన్షన్ పడకు అని అనామికతో ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత అనామిక ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. వాళ్ళని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తుంది అనామిక. ఆవిడ ఎవరని అపర్ణని అడుగుతాడు. మా అత్తయ్య ఈ ఇంట్లో ఏ డెసిషన్ అయిన మా అత్తయ్య గారే తీసుకుంటారని కావ్య అంటుంది. ఒకప్పుడు తను చెప్పినట్టు వినేవాళ్ళం.. ఇప్పుడు ఈ కావ్య చెప్పినట్టు వింటున్నామని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో నా జీవితానికి సంబంధించిన నిర్ణయం రేపు చెప్పబోతున్నానని రాజ్ అంటాడు. రేపు ఎందుకు అని ఇందిరాదేవి అంటుంది. కావ్య పేరెంట్స్ కూడా ఉండాలి అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |